
వరుస ఫ్లాపులతో కెరియర్ లో వెనకపడ్డ యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా స్టాండ్ అప్ రాహుల్. శాంటో మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం రిలీజైంది. స్టాండ్ అప్ కామెడీ చేసే హీరో తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఫేస్ చేశాడు. జీవితాన్ని చాలా లైట్ అనుకున్న అతనికి ఎదురైన సమస్యలు ఏంటి.. వాటిని ఎలా క్రాస్ చేశాడు అన్నది సినిమా కథ. టీజర్ మొత్తం కామెడీతో నింపేశాడు డైరక్టర్ శాంటో.
న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా.. రాజ్ తరుణ్ కు ఈ స్టాండ్ అప్ రాహుల్ అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమా టీజర్ ను దగ్గుబాటి రానా రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెష్ అందించారు.