థియేటర్లో తిమ్మరుసు.. ఈ నెల 30 న రిలీజ్..!

యువ హీరో సత్యదేవ్ లీడ్ రోల్ లో శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన సినిమా తిమ్మరుసు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మహేష్ కోనేరు, సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తో మెప్పించింది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా జూలై 30 రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ నుండి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడ్డాయి. థియేటర్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ నెల చివరన తిమ్మరుసుగా సత్యదేవ్ మొదటి ప్రయత్నం చేస్తున్నాడు.

ఈమధ్య వరుస సినిమాలతో మంచి ఫాం లో ఉన్న సత్య దేవ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా తిమ్మరుసు. ఓటిటి ఆఫర్లు వచ్చినా సరే థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగులో రిలీజ్ అవుతున్న మొదటి సినిమాగా తిమ్మరుసు వస్తుంది. మరి ఈ సినిమాకు ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.