మెగాస్టార్ మరోసారి 'గ్యాంగ్ లీడర్' అవుతున్నాడా..!

ఆచార్య పూర్తి చేసే హడావిడిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆచర్య తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ రీమేక్ ను కోలీవుడ్ డైరక్టర్ మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో మెగాస్టార్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. లూసిఫర్ రీమేక్ తో పాటుగా రవీంద్ర డైరక్షన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు చిరంజీవి.

బాబీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిరు గ్యాంగ్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన చిరు మరోసారి ఆ పాత్రలో అలరించనున్నారట. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి లుక్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. బాబీ సినిమా కోసం చిరు స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.