
సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ సరసన మళయాళ భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా సూపర్ అనిపించుకుంటుందని అంటున్నారు. బ్యాంక్ స్కాం ల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరన్నది ఇప్పటికి కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. మొన్నటివరకు అర్జున్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు రాగా లేటెస్ట్ గా సముద్ర ఖని సర్కారు వారి పాటలో విలన్ గా నటిస్తాడని అంటున్నారు.
అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాలతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా సముద్రఖని విలన్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయని అంటున్నారు. సకారు వారి పాట సినిమాలో మహేష్ తన పోకిరి లుక్ తో కనిపిస్తారని టాక్.