
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ డైరక్షన్ లో 70 ఎం.ఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సొడా సెంటర్. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సినిమాలోని మందులోడా అనే మాస్ సాంగ్ ను మెగాస్టార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరు సాంగ్ సూపర్ గా ఉందని సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో లైటింగ్ సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారు. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మణిశర్మ మార్క్ మాస్ బీట్ తో మందులోడా సాంగ్ మాస్ ఆడియెన్స్ ను అలరించేలా ఉంది. ఈ సాంగ్ లో సుధీర్ బాబు డ్యాన్స్ కూడా అదరగొట్టినట్టు తెలుస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు నటన హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.