దిల్ రాజు ఓటిటి ప్లాన్..!

డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. కరోనా వల్ల థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటిటిల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఆహా లాంచ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ తో సమానంగా కంప్లీట్ తెలుగు ఓటిటిగా ఆహా సూపర్ క్లిక్ అయ్యింది. ఈమధ్యనే ఆర్జీవి స్పార్క్ అనే ఓటిటి మొదలు పెట్టాడు. ఈనాడు రామోజీరావు కూడా సొంత ఓటిటి ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. సురేష్ బాబు, నాగార్జున కలిసి కూడా మరో ఓటిటి ప్లాన్ చేస్తున్నారట. వీరితో పాటుగా దిల్ రాజు కూడా సొంత ఓటిటి ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు చేస్తున్న ఈ ఓటిటిలో రాం చరణ్ కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది. ఓ పక్క నిర్మాతగా భారీ సినిమాలను చేస్తున్న దిల్ రాజు ఓటిటిపై మనసు మళ్లింది. దీనికి సంబందించిన అప్డేట్ త్వరలో బయటకు వస్తుంది.