
సుధీర్ బాబు హీరోగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు పాత్రలో నటిస్తున్నారు. సినిమా నుండి మొదటి సాంగ్ మందులోడా సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నారు. జూలై 9 ఉదయం 9 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
ఫస్ట్ గ్లింప్స్ తో సూపర్ అనిపించుకున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమా నుండి మొదటి మాస్ సాంగ్ రాబోతుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఈ బ్యానర్ లో ఆల్రెడీ భలే మంచి రోజు సినిమా చేశాడు సుధీర్ బాబు. మళ్లీ అదే బ్యానర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. పలాస సినిమాతో డైరక్టర్ గా ప్రతిభ చాటిన కరుణ కుమార్ శ్రీదేవి సోడా సెంటర్ తో మరోసారి టాలెంట్ చూపించాలని చూస్తున్నారు.