
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా తిరిగి మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నారు. సినిమాలో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జతగా పూజా హెగ్దే నటిస్తుంది. దాదాపు షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా కొద్దిపాటి షూటింగ్ పెండింగ్ ఉంది. అది బుధవారం నుండి మొదలైంది. త్వరలోనే సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది.
అనుకున్న విధంగా షూటింగ్ పూర్తయితే ఆగష్టు లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది తెలియాల్సి ఉంది.