
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. అదే రేంజ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా లైగర్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా గురించి స్పెషల్ అప్డేట్ రౌడీ హీరో ఫ్యాన్స్ ను అలరిస్తుంది. రీసెంట్ గా ఓ షోలో భాగంగా లైగర్ అప్డేట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమా 65 శాతం వరకు పూర్తయిందని క్లైమాక్స్ షూట్ పెండింగ్ ఉందని చెప్పాడు.
క్లైమాక్స్ ఫైట్ 1000 మందితో ప్లాన్ చేసినట్టు చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమాలో క్లైమాక్స్ చాలా కీలకంగా ఉంటుందట. అందుకే రౌడీ ఫ్యాన్స్ తమ హీరో చెప్పిన ఆ 1000 మందితో ఫైట్ విషయంపై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. పూరీ సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ లు భారీగానే ఉంటాయి. అదే రేంజ్ లో లైగర్ లో కూడా క్లమాక్స్ అదిరిపోతుందని తెలుస్తుంది.