ఫుల్ జోష్ లో పూజా హెగ్దే..!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ బ్యాచ్ లర్ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా వస్తున్న బీస్ట్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇక లేటెస్ట్ గా మరో రెండు అదిరిపోయే ఛాన్సులు అందుకుందని తెలుస్తుంది. త్రివిక్రం శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. ఆల్రెడీ మహేష్ తో మహర్షి సినిమాలో జత కట్టింది పూజా హెగ్దె. 

ఇక ఇదే కాకుండా యువ హీరో నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని టాక్. నితిన్ తో పూజా హెగ్దే మొదటిసారి జోడీ కడుతుండటం విశేషం. ప్రస్తుతం అమ్మడు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా రానున్న సినిమాలకు మరో కోటి అంటే 3 కోట్లు ఉంటేనే తనతో సినిమా అంటూ డిమాండ్ చేస్తుందట. పూజా గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని ఆమె కోరినంత ఇచ్చి అమ్మడిని ఓకే చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.