ఏజెంట్ అఖిల్ తో రష్మిక..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. బ్యాచ్ లర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుండగా ఏజెంట్ ను మాత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. 

ఏజెంట్ సినిమాలో అఖిల్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తెలుగులో కన్నడ భామ రష్మిక ఫుల్ ఫాం లో ఉంది. ఆమె చేస్తున్న ప్రతి సినిమా సక్సెస్ అవడంతో తెలుగులో లక్కీ హీరోయిన్ గా మారింది రష్మిక. ఈ క్రమంలో రష్మికకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఏజెంట్ తో అఖిల్ సరసన రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం అమ్మడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కూడా నటిస్తుంది.