వరుణ్ తేజ్ 'గని' డిజిటల్, శాటిలైట్ డీల్ క్లోజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం రియల్ బాక్సర్ గా మారిపోయాడు వరుణ్ తేజ్. సినిమాలో హీరోయిన్ గా సయి మంజ్రేకర్ నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 40 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ అయిన వరుణ్ తేజ్ గని సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తుంది. అహా లో డిజిటల్ రైట్స్.. స్టార్ మా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నాయని తెలుస్తుంది. డిజిటల్ శాటిలైట్ రైట్స్ కలిపి 23 కోట్ల దాకా పలికాయట. 

బడ్జెట్ లో మిగిలిన 20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేస్తే రిలీజ్ కు ముందే వరుణ్ తేజ్ గని లాభాలు పొందినట్టే లెక్క. గని విషయంలో వరుణ్ తేజ్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఆ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు మెగా హీరో.