
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ ఇద్దరు సూపర్ హిట్ జోష్ లో ఉన్నారు. పుష్ప సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేయాలని అనుకున్న పుష్పని ఇప్పుడు రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ పుష్ప షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
30 రోజుల లాంగ్ షెడ్యూల్ షూట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ తో మొదటి పార్ట్ పూర్తవుతుందని అంటున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. కచ్చితంగా మెగా, అల్లు ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా పండుగ చేసుకునేలా ఉంటుందని చెబుతున్నారు.