
ఉప్పెన సినిమాతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తన దూకుడు చూపిస్తున్నాడు. క్రిష్ డైరక్షన్ లో ఆల్రెడీ మూవీ పూర్తి కాగా అర్జున్ రెడ్డి తమిళ దర్శకుడు గిరీశయ్య డైరక్షన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలతో పాటుగా త్వరలో మరో సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న ఏజెంట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు సురేందర్ రెడ్డి ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
సురేందర్ రెడ్డి, వైష్ణవ్ తేజ్ సినిమాకు దశరథ్ కథ అందిస్తున్నారట. డైరక్టర్ దశరథ్ రైటర్ గా కూడా పనిచేశారు. తన కథలతో చాలా సినిమాలు వచ్చాయి. లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ కోసం దశరథ్ ఓ సూపర్ కథ రాయగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అది తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.