
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లవ్ స్టోరీలో నటించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న వీరి కాంబో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇదే కాకుండా కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ ఎన్.టి.ఆర్ కు ఒక స్టోరీ వినిపించాడట.
రాజా రాణి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుని దళపతి విజయ్ తో సినిమాలు చేస్తూ వరుస హిట్లు అందుకుంటున్న అట్లీ ప్రస్తుతం షారుఖ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. ఈమధ్యనే అట్లీ తారక్ కోసం ఓ లవ్ స్టోరీ లైన్ చెప్పాడట. స్టోరీ లైన్ నచ్చిన ఎన్.టి.ఆర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారట. తెలుగులో సినిమా చేయాలని కొన్నాళ్లుగా అట్లీ ప్రయత్నిస్తున్నారు. అట్లీ, ఎన్.టి.ఆర్ సినిమా ఫిక్స్ అయితే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు.