
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ భవ్య భిష్ణోయ్ ల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి కార్డ్ తో వస్తారనుకున్న ఈ జంట తాము విడిపోతున్నట్టుగా ప్రకటించారు. కొన్ని పరిస్థితుల వల్ల మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు వెల్లడించింది. రాజకీయ నేపథ్యం ఉన్న భవ్య భిష్ణోయ్ ఫ్యామిలీకి పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలు చేయడం ఇష్టం లేదని తెలుస్తుంది. ఈ కారణంతోనే మెహ్రీన్ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్టు చెబుతున్నారు.
మెహ్రీన్ కౌర్ ఆల్రెడీ కమిటైన సినిమాలతో పాటుగా కొత్త సినిమాలకు సైన్ చేయడం భవ్య భిష్ణోయ్ ఫ్యామిలీకి నచ్చలేదట. దాదాపు ఈ కారణంతోనే పెళ్లిని రద్దు చేసుకున్నారని తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి రద్దు చేసుకున్న త్రిష, నయనతార, రష్మికల లిస్ట్ లో ఇప్పుడు మెహ్రీన్ కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం f3 సినిమాలో నటిస్తున్న మెహ్రీన్ లేటెస్ట్ గా మారుతి డైరక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.