
మళయాళం లో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్నారు. త్రివిక్రం మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తిరిగి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా మరో రెండు షెడ్యూళ్లతో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా మొన్నటిదాకా బిల్లా రంగా అని పెడతారని చెప్పుకోగా లేటెస్ట్ గా పరశురామ కృష్ణమూర్తి అని పెట్టబోతున్నరని టాక్.
పరశురామ కృష్ణమూర్తి టైటిల్ కూడా వెరైటీగా ఉంది. ఇందులో పరశురాం ఎవరు కృష్ణమూర్తి ఎవరన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా పవన్ క్రిష్ డైరక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. రానా విరాటపర్వం ఆల్రెడీ రిలీజ్ కు రెడీగా ఉంది.