ఎన్.టి.ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో స్పెషల్ రోల్ లో బొమన్ ఇరాని నటిస్తున్నాడని టాక్. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు టైటిల్ గా సెన్సేషనల్ అనేది పరిశీలనలో ఉంది. సినిమా టైటిల్ లోనే సెన్సేషనల్ అని పెట్టారంటే సినిమా కూడా టైటిల్ కు తగినట్టుగా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.