
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి నటిస్తున్న మళయాళ రీమేక్ మూవీ సెట్స్ మీద ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాలో పవన్, రానాల మధ్య యాక్షన్ సీన్స్ హైలెట్ గా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవల్ లో తీసుకెళ్తాయని అంటున్నారు.
మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా డాన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు బిల్లా రంగ టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.