
అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మేజర్. ముంబై తాజ్ హొటల్ ఉగ్ర దాడుల జరిపినపుడు వీరోచితంగా పోరాడి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈ ఆపరేషన్ లో ఆయన వీరమరణం పొందారు. ఆ కథతోనే మేజర్ సినిమా వస్తుంది. గూఢచారితో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై హిందీలో కూడా అంచనాలు పెరిగాయి.
అందుకే మేజర్ హిందీ శాటిలైట్ రైట్స్ 10 కోట్లు పలికాయి. బాలీవుడ్ లో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏంటన్నది ఈ శాటిలైట్ రైట్స్ చూసి అర్ధం చేసుకోవచ్చు. క్షణం, గూఢచారి సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ లు కూడా హిట్ అవడంతో అడివి శెష్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది. అడివి శేష్ హీరోగా సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ అనగానే మేజర్ సినిమాపై బాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.