
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న బన్నీ ఈ సినిమా రెండు పార్టులు పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా షూటింగ్ చేయాలని చూస్తున్నారు. అందుకే వేణు శ్రీరాం ఐకాన్ సినిమాకు కేవలం 3 నెలలు మాత్రమే డేట్స్ ఇస్తానని చెప్పాడట. ఇక ఈ సినిమాతో పాటుగా తమిళ సూపర్ హిట్ ప్రొడ్యూసర్ కళైపులి ఎస్ థాను తో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈమధ్యనే నిర్మాత హీరో చర్చలు జరిగాయట.
తమిళ స్టార్ డైరక్టర్ ఈ సినిమాను చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలని చూస్తున్నారు. అల్లు అర్జున్, మురుగదాస్ కాంబోలో ఓ సినిమా వస్తుందని అన్నారు. బహుశా కళైపులి థానుతో సినిమా మురుగదాస్ తోనే ఉండే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.