
మా ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం బాగా వినిపిస్తున్న మాట లోకల్, నాన్ లోకల్. ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి నిలబడుతున్నాడు అనగానే ప్రత్యర్ధులు ఎక్కు పెట్టిన బాణం నాన్ లోకల్. రెండు దశాబ్ధాలుగా ఇక్కడ సినిమాలు చేస్తూ తన ఐడెంటిటీ ఇక్కడే ఉన్నా సరే ఇంకా తాను నాన్ లోకల్ ఎలా అవుతానని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చుకున్నా ఆయనపై నాన్ లోకల్ అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అయితే దీనిపై తన మార్క్ రెస్పాన్స్ ఇచ్చారు సీనియర్ నటుడు సుమన్. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు లోకలే అని అన్నారు. వైద్యులు, రైతులు కూడా నాన్ లోకల్ అనుకుంటే జనాలకు వైద్య చికిత్స, ఆహారం అందవని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా చెప్పలేదు కాని ఆయన ప్రకాష్ రాజు కు మద్ధతుగానే ఈ వ్యాఖ్యలు చేశారని అర్ధమవుతుంది.
డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన సుమన్ కరోనా టైం లో వైద్యులు చేసిన సేవలని కొనియాడారు. మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు. అందరు కలిసి ఉండాలని.. లోకల్, నాన్ లోకల్ భావనలు ఏమి వద్దని సుమన్ అన్నారు.