
టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నరసింహాచారి కుటుంబానికి అండగా నిలిచారు సంపూర్ణేష్ బాబు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్టీ చెల్లపూర్ కు చెందిన నరసింహా చారి దంపతులు అప్పుల బాధ భరించలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో వారి ఇద్ద్రు కూతుళ్లు అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు ఆ ఇద్దరి పిల్లలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆ పిల్లలకు 25 వేల చెక్ అందించిన సంపూర్ణేష్ బాబు వారి చదువులకు అయ్యే ఖర్చుని తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ పనిని తన నిర్మాత సాయి రాజేష్ తో కలిసి చేశానని చెప్పారు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు చేసిన ఈ పనికి ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం బజారు రౌడీ, క్యాలీ ఫ్లవర్, పుడింగి నంబర్ 1 సినిమాల్లో నటిస్తున్నారు.