
కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ డైరక్షన్ లో వస్తున్న హిస్టారికల్ మూవీ బింబిసారా. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ బాగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఇక సినిమాలో నందమూరి హీరో మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. బింబిసారా కళ్యాణ్ రామ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెబుతున్నారు.
బింబిసారుడు కథతో వస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. బాలకృష్ణకు ఆదిత్య 369 లానే కళ్యాణ్ రామ్ కు బింబిసారా అవుతుందని అంటున్నారు. నంద్మూరి ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.