శ్యామ్ ఈజ్ బ్యాక్.. చివరి షెడ్యూల్ మొదలైంది..!

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. సెకండ్ వేవ్ లాక్ డౌన్ కు ముందు షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మొన్నటిదాకా లాక్ డౌన్ ఉండగా ఈమధ్యనే మళ్లీ షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చారు. లేటెస్ట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాకు సంబందించిన చివరి షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తెలియచేస్తూ శ్యామ్ ఈజ్ బ్యాక్ అని నాని తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.      

నాని శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.