హెయిర్ స్టైల్ తో పడేస్తారట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న రాధే శ్యాం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేస్తున్నాడట. ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుందని అంటున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న క్యారక్టర్స్ లో కనిపిస్తారని తెలుస్తుంది.

కె.జి.ఎఫ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. కె.జి.ఎఫ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.