రష్మికకు అలాంటి భర్త కావాలట..!

కన్నడ భామ రష్మిక తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో వారితో చాట్ చేస్తూ వారు అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది రష్మిక. లేటెస్ట్ గా రష్మికకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. మీకు ఎలాంటి భర్త కావాలని ఓ అభిమాని అడిగాడు. రష్మిక కూడా అయ్యో ఇప్పుడే అలాంటి ప్లాన్స్ ఏమి లేవని చెప్పకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయ్యి ఉండాలని.. హంగులు ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఉండాలని చెప్పింది రష్మిక. ఆమె చెప్పిన ఆన్సర్ కు ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. సినిమాతో పాటుగా మరో రెండు తెలుగు సినిమాల డిస్కషన్స్ లో ఉంది. తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న రష్మిక సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.