
హిట్టు ఖాతా తెరవలేదు కాని అఖిల్ సినిమాలో వరుస సినిమాలు మాత్రం వస్తున్నాయి. అక్కినేని హీరో నటించిన బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండగా లేటెస్ట్ గా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాను కూడా డిసెంబర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలాఉంటే అఖిల్ 6వ సినిమా చర్చల దశల్లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాను శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తారని టాక్.
సక్సెస్ లేని శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణు తో ఢీ & ఢీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్న శ్రీను వైట్ల మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేస్తున్నారు. ఢీ 2 హిట్ అయితే ఈ కాంబో ఫిక్స్ అయినట్టే.