RRR కొత్త పోస్టర్ అదిరిందిగా..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ లు నటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ ఒలివియా మోర్స్ కూడా ఈ సినిమాలో భాగమవుతుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న RRR సినిమా నుండి లేటెస్ట్ గా ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 

సినిమాలో నటిస్తున్న హీరోలు ఇద్దరు బైక్ పై ఉన్న పోస్టర్ ఒకటి రిలీజైంది. సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. 2021 అక్టోబర్ 13న సినిమా రిలీజ్ అనుకున్నారు. చూస్తుంటే అనుకున్న టైం కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఉన్నారు. రిలీజ్ డేట్ విషయంలో చిత్రయూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.