అఖిల్ ఏజెంట్ లో మళయాళ సూపర్ స్టార్..!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా ఏజెంట్. అఖిల్ కెరియర్ లో పక్కా మాస్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తారని టాక్. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో మమ్ముట్టిని తీసుకున్నారని తెలుస్తుంది. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఆగష్టు రెండోవారంలో అఖిల్ బ్యాచ్ లర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఓటిటి ఆఫర్లు వస్తున్నా థియేట్రికల్ రిలీజ్ కోసమే ఎదురుచూస్తున్నారట చిత్రయూనిట్. ఇక ఏజెంట్ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 24న అఖిల్ ఏజెంట్ రిలీజ్ అవుతుందని టాక్.