
మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్నాడు. తను చేసిన సినిమాలన్ని మ్యూజికల్ గా సూపర్ హిట్ అవుతున్నాయి. థమన్ మ్యూజిక్ అంటే సినిమా సగం హిట్ అనే టాక్ వచ్చేసింది. సాంగ్స్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తమన్ ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ సినిమాలన్ని చేస్తున్న థమన్ లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ మూవీ ఛాన్స్ అందుకున్నాడు. మళయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో చిరు రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ ను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక సినిమాకు థమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు దర్శకుడు మోహన్ రాజా. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మొదటిసారి పనిచేస్తున్న థమన్ తనకు ఆయన మీద ఉన్న అభిమానానికి కానుకగా ఈ ఆల్బం గిఫ్ట్ గా ఇవ్వాలని చూస్తున్నాడు. అసలే సూపర్ ఫాం లో ఉన్న థమన్ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలని సూపర్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు మెగా ఫ్యాన్స్.