
గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుంతలం సినిమా మళ్లీ తిరిగి షూటింగ్ కు రెడీ అవుతుంది. లాక్ డౌన్ కు ముందు కొంత పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. జూలై 1 నుండి శాకుంతలం సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో సమంతతో పాటుగా మళయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
మైథలాజికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేశారు. సినిమా అనుకున్న్ దాని కన్నా బాగా వస్తుందని చెబుతున్నారు చిత్రయూనిట్. సినిమాలో సమంత నటనకు అందరు ఫిదా అవుతారని అంటున్నారు. గుణశేఖర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2022 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో మోహన్ బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది.