
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమ ఆచార్య, మ్యాట్నీ మూవీ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాం చరణ్ కూడా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మరో 15 రోజులు పెండింగ్ ఉందని తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలైలో ఆచార్య షెడ్యూల్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
సినిమా నుండి రిలీజైన మొదటి సాంగ్ లాహే లాహే కూడా 60 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. చిరు, చరణ్ నటిస్తున్న ఆచార్య మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అసలైతే మే 13న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డది. షూటింగ్ పూర్తి చేసుకున్నాక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.