'మా' ఎన్నికల కోసం చైనా అధ్యక్షుడిని కలిసిన బ్రహ్మాజి..!

'మా' ఎన్నికల వేడి ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సీవిఎల్ నరసింహా రావు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు బ్రహ్మాజి పెట్టిన ఓ పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది. చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ ను కలిసిన ఫోటో.. అందులో బ్రహ్మాజీకి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తుంటే బ్రహ్మాజి మాత్రం నమస్కరిస్తున్నారు. ఫోటోతో పాటు ఇది మాములు మీటింగ్ మాత్రమే ఎలాంటి రాజకీయాలకు తావు లేదని.. మా ఎన్నికల గురించి చర్చించాం ఆయన కొన్ని టిప్స్ చెప్పారని కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బ్రహ్మాజి.  ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టి మా ఎన్నికలను వేడెక్కిస్తుంటే బ్రహ్మాజి మాత్రం ఈ ఫన్నీ పోస్ట్ తో అందరిని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.