
రెండు నెలల్లో జరుగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రోజుకొక ట్విస్ట్ ఏర్పడుతుంది. ఇప్పటివరకు నలుగురు మాత్రమే పోటీ దారులు అనుకోగా లేటెస్ట్ గా మరో అభ్యర్ధి మాలో పోటీకి దిగుతున్నారు. సీనియర్ నటుడు సివిఎల్ నరసిం హా రావు కూడా ఈసారి మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన తెలంగాణా వాదంతో బరిలో దిగుతున్నారని చెబుతున్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్లకే ముందు అవకాశం ఇచ్చేలా చూడటమే తన లక్ష్యమని అన్నారు.
సీవిఎల్ నరసింహా రావుకి సీనియర్ యాక్ట్రెస్ విజయశాంతి మద్ధతు ఇచ్చారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ నలుగురు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఇప్పుడు సీవిఎల్ నరసింహా రావు కూడా రంగంలోకి దిగుతున్నారు. మెగా మద్ధతు ఎవరికి ఉంటే వారికే మా పదవి అనే ప్రచారం జరుగుతున్నా మెగా బ్రదర్ నాగ బాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా ఉంటున్నారని భావిస్తున్నారు. మంచు విష్ణు కూడా మా అధ్యక్షుడిగా తనని గెలిపిస్తే తను చేయాలనుకున్న పనుల గురించి ఓపెన్ లెటర్ రాశాడు. జీవిత రాజశేఖర్, హేమలు కూడా ఎవరి ప్లాన్లలో వారు ఉన్నారు.