
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా శేషాచలం అడవులు.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ముందు ఒక సినిమాగా అనుకున్న పుష్ప సినిమా ఇప్పుడు రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని అంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ అంధుడిగా కనిపిస్తారని అంటున్నారు. అందుకే ఐకాన్ ట్యాగ్ లైన్ గా కనబడుట లేదు అని పెట్టారట. బన్నీ కెరియర్ లో ఈ సినిమా ప్రయోగాత్మకంగా వస్తుందని చెబుతున్నారు. సినిమా ప్రొడక్షన్ లో దిల్ రాజుతో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలుస్తుంది.