
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ డైరక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమాతో పాటుగా శరత్ చంద్ర డైరక్షన్ లో అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాపై దర్శకుడు హరీష్ శంకర్ అంచనాలు పెంచేస్తున్నాడు. సినిమాలో పవన్ కళ్యాణ్ ను బద్రిలో ఉన్నంత పవర్ ఫుల్ గా చూస్తారని చెప్పాడు.
తన సినిమాతో మరోసారి బద్రిలోని పవన్ ను చూస్తారని చెబుతున్నాడు హరీష్ శంకర్. అసలే గబ్బర్ సింగ్ కాంబో ఆ సూపర్ హిట్ సినిమా కాంబినేషన్ రిపీట్ చేస్తూ మళ్లీ బద్రి క్యారక్టర్ గుర్తుచేస్తున్న హరీష్ శంకర్ ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.