ప్రైమ్ లోనే నారప్ప..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. తెలుగు రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు నారప్ప టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను అమేజాన్ ప్రైం లో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారట.

ఇప్పటికే బిజినెస్ డీల్స్ ఓకే అవగా జూలై 24న నారప్ప ప్రైం లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ చేస్తున్న దృశ్యం 2 సినిమాను కూడా అమేజాన్ ప్రైం కే అమ్మినట్టు తెలుస్తుంది. రెండు సినిమాలకు కలిపి ఫ్యాన్సీ ప్రైజ్ అందుకున్నారట నిర్మాత సురేష్ బాబు.