
4 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఐదవ సీజన్ కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక జరుగగా వారిని ఐసోలేషన్ కు పంపించే ఏర్పాట్లలో ఉన్నారట. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ సీజన్ కూడా నడుస్తుందని తెలుస్తుంది. 16 మంది సభ్యులు ఉండే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు హోస్ట్ గా కింగ్ నాగార్జుననే చేస్తున్నారని ఇన్నాళ్లు అనుకున్నారు కాని లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ 5 హోస్ట్ మారుతున్నారని సమాచారం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని, సీజన్ 3,4 లకు నాగార్జున హోస్ట్ గా చేశారు. సీజన్ 5కి నాగ్ హోస్ట్ గా అనుకున్నారు. కాని సినిమా షెడ్యూళ్లకు అడ్డు పడుతుందని ఈ సీజన్ మిస్ చేస్తున్నారట నాగార్జున. నాగార్జున ప్లేస్ లో దగ్గుబాటి రానా హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ నెంబర్ 1 యారీ షోకి హోస్ట్ గా రానా మెప్పించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షోలో తన మార్క్ చూపించబోతున్నారు.