
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి నెగటివ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే సినిమా నుండి సాయి పల్లవి లుక్ రిలీజ్ చేశారు. చేతిలో త్రిశూలంతో సాయి పల్లవి లుక్ అందరిని సర్ ప్రైజ్ చేసింది.
ఈ సినిమాను ముందు కలకత్తాలోనే షూట్ చేయాలని అనుకోగా కరోనా సెకండ్ వేవ్ వల్ల కలకత్త్తా లో షూటింగ్ క్యాసిల్ చేసుకున్నారు. హైదరాబాద్ లోనే కలకత్తాకు సంబందించిన సెట్ వేసినట్టు తెలుస్తుంది. సినిమాలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టికి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాని కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా వస్తుంది.