
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రభాస్ రాధే శ్యాం సినిమా షూటింగ్ నేడు మొదలైంది. మరో 10 రోజుల షెడ్యూల్ తో సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది.
ప్రభాస్ తో పాటుగా మిగతా కొంతమంది ఆర్టిస్టులతో హైదరాబాద్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్, శానిటైజర్ వాడుతూ సినిమా షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ ఎప్పుడన్న దాని మీద క్లారిటీ రాలేదు. ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ రాధే శ్యామ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.