వెబ్ సీరీస్ కోసం నెగటివ్ టచ్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో సూపర్ బిజీ అయ్యింది. సినిమాలే కాదు ఈమధ్య వెబ్ సీరీస్ లతో కూడా తమన్నా టాలెంట్ చూపిస్తుంది. ఇప్పటికే లెవెంత్ అవర్, నవంబర్ డైరీస్ వెబ్ సీరీస్ లలో నటించిన అమ్మడు లేటెస్ట్ గా మరో వెబ్ సీరీస్ కు సైన్ చేసిందని తెలుస్తుంది. అమేజాన్ ప్రైం ఒరిజినల్స్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ ను అరుణిమ శర్మ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో తమన్నా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తుంది. ఈమధ్యనే సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ లో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సమంత బాటలోనే తమన్నా కూడా నెగటివ్ రోల్ కు రెడీ అయ్యింది.

సినిమాలతో పాటుగా వచ్చిన ప్రతి వెబ్ సీరీస్ ను ఓకే చేస్తున్న తమన్నా.. ఓటిటి కంటెంట్ లో హీరోయిజం ఉండదు. ఇక్కడ కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంది. అమేజాన్ ప్రైం లో రాబోతున్న వెబ్ సీరీస్ కు యారీ దోస్తీ అని ఫిక్స్ చేశారు. కెరియర్ లో ఫస్ట్ టైం నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్న తమన్నా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.