
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా కన్ ఫాం చేసిన విషయం తెలిసిందే. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఆసియన్ సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించనుందని తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా కోసం ధనుష్ 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు డైరక్షన్ లో మరో తెలుగు సినిమా చేస్తాడట ధనుష్. ఈ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలో రానుందని అంటున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఒకరు ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటుగా తమిళ, హిందీలో తెరకెక్కిస్తారని అంటున్నారు. మొత్తానికి తమిళ హీరోలు వరుస తెలుగు సినిమాలు చేస్తూ సత్తా చాటాలని చూస్తున్నారు.