ప్రకాశ్ రాజ్ లోకల్ or నాన్ లోకల్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఈసారి కూడా రసవత్తరమైన పోటీ ఏర్పడేలా ఉంది. ఈసారి అధ్యక్ష పదవికి నలుగురు సభ్యులు పోటీ చేస్తుండటం విశేషం. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ఈ నలుగురు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఏడాది క్రితం నుండి ఈ పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరెలా ఉన్నా తన ప్యానెల్ సభ్యులను కూడా ప్రకటించి షాక్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మీద వస్తున్న నాన్ లోకల్ కామెంట్స్ కు తన మార్క్ సమాధానం ఇచ్చారు.

ఇది తాను ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. దాని వెనక చాలా మధనం ఉందని అన్నారు ప్రకాష్ రాజ్. తెలుగు పరిశ్రమ తనకు పేరు, హోదా, గౌరవం ఇచ్చిందని.. అలాంటప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలను చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదనిపించిందని అన్నారు. ఊరికే బాగలేదన్న ఫిర్యాదులు చేసే బదులు పని చేసి చూపించడం కష్టం అది బాధ్యత కూడా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.


ఏడాది నుండి కళ్ల ముందు జరుగుతున్న విషయాలను చూస్తూ కూర్చోవాం సరికాదని అనిపించింది. సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని అనిపించింది. నాలా ఆలోచించే వారితో ఒక టీం తయారు చేసుకున్నా.. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కొవిడ్ వల్ల వాయిదా పడ్డాయి. ఆ విషయాన్ని అయినా కమిటీ చెప్పాలి కదా ఎప్పుడు ఎన్నికలు జరుపుతారని ఇప్పటికి చెప్పట్లేదని అన్నారు. సినిమా అనేది ఒక భాష.. వీడు మనోడు.. వేరే వాడు అనే ఆలోచన తప్పు.. తెలుగు వ్యక్తి విశాల్ తమిళనాడు అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచాడు. అక్కడ అన్ని భాషల వారు పోటీ చేశారు కదా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్న వారికి నేను తెలంగాణాలో కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనిపించలేదా అని ప్రశ్నించారు.  

నా అసిస్టెంట్లకు హైదరాబాద్ లో కొన్ని కొని ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అనిపించలేదా..? నాకు ఇక్కడ పొలం ఉంది.. ఇల్లు ఉంది.. నా కొడుకు ఇక్కడే స్కూల్ కు వేళతాడు. నా ఆధార్ కార్డ్ అడ్రెస్ ఇక్కడే ఉంది.అలాంటప్పుడు నేను నాన్ లోకల్ ఎలా అవుతానని అన్నారు ప్రకాష్ రాజ్. అంతపురం సినిమాకు జాతీయ అవార్డ్ తీసుకున్నప్పుడు నేను నాన్ లోకల్ అనలేదే.. తొమ్మిది సార్లు నంది అవార్డులు తీసుకున్నప్పుడు నేను నాన్ లోకల్ అనిపించలేదా..? అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది..? ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదని ఎవ్రైనా అంటే ప్రేక్షకులే వారి మొహం మీఅ నవ్వుతారని ఆయన అన్నారు.