అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ వెనక కష్టం ఇది..!

మెగా హీరో అల్లు శిరీష్ కెరియర్ ఇంకా సెట్ అవలేదని చెప్పాలి. సినిమాలైతే చేస్తున్నాడు కాని తన మార్క్ చూపించడంలో వెనకపడుతున్నాడు అల్లు శిరీష్. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు శిరీష్ చేస్తున్న సినిమా ప్రేమ కాదంట పై సూపర్ బజ్ ఏర్పడింది. రాకేష్ శశి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అల్లు వారబ్బాయి శిరీష్ సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. తన సిక్స్ ప్యాక్ కు సంబందించిన ట్రైనింగ్ వీడియోని ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు అల్లు శిరీష్.

ఇక సినిమా విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. సిక్స్ ప్యాక్ లుక్ తో అల్లు శిరీష్ ఈ సినిమాలో చాలా రొమాంటిక్ గా కనిపించనున్నారట. అంతేకాదు ప్రేమ కాదంట ప్రేమ కథతో పాటే యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా అల్లు శిరీష్ ఖాతాలో ఓ బంపర్ హిట్ పడేలా చేస్తుందో లేదో చూడాలి.