
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు 200 కోట్ల ఓటిటి ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించారు హీరో విజయ్. 200 కోట్ల ఆఫర్ చాలదని దాన్ని మించి తన సినిమా వసూలు చేస్తునని కామెంట్ పెట్టాడు విజయ్ దేవరకొండ.
విజయ్ అలా కామెంట్ పెట్టడం చూసి సినిమాపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని అర్ధమవుతుంది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్ ఈసారి నేషనల్ వైడ్ తన లెక్క ఏంటన్నది చూపించబోతున్నాడు.