'మా' ఎన్నికలు.. ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు..!

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా మంచు వారబ్బాయి మంచు విష్ణు బరిలో దిగుతున్నాడు. లాస్ట్ టైం నరేష్ వర్సెస్ శివాజీరాజా ఎపిసోడ్ అందరికి తెలిసిందే. ఎన్నో వివాదాలు, గొడవల మధ్య లాస్ట్ ఇయర్ నరేష్ ప్యానెల్ గెలిచింది. అయినా సరే నిధుల దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో నరేష్ ను అధ్యక్ష పదవి నుండి తప్పించారు. మరో 3 నెలల్లో మా ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటినుండే కార్యచరణ మొదలు పెట్టారు.

ప్రకాశ్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు లలో తెలుగు ఆర్టిస్టులు కొందరు మంచు విష్ణు ప్యానెల్ కే సపోర్ట్ చేస్తున్నారు. 750 పైగా మా సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష పదవికి ఇతర భాషకు చెదిన ఆర్టిస్ట్ ఎందుకని కొందరి వాదన. ఒకప్పుడు మా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా ఉండేది కాని ఇప్పుడు దీనికి కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.