
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా నెల్సన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా బీస్ట్. విజయ్ బర్త్ డే సందర్భంగా బీస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ గా గన్ను పట్టుకున్న విజయ్ పోస్టర్ వదిలారు. ఈ లుక్ చూసి విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బీస్ట్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఓ అంచనాలు పెంచారు మేకర్స్.
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. రీసెంట్ గా మాస్టర్ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ బీస్ట్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. కోలీవుడ్ లో సక్సెస్ ఫాం లో ఉన్న దర్శకుడు నెల్సన్ అదే జోష్ లో ఉన్న విజయ్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.