
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్, రియాలిటీ షోస్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈమధ్యనే లెవెంత్ అవర్, నవంబర్ డైరీస్ వెబ్ సీరీస్ లతో ప్రేక్షకులను అలరించిన తమన్నా లేటెస్ట్ గా ఓ రియాలిటీ షో హోస్ట్ గా కనిపించనుదని తెలుస్తుంది. స్టార్ ప్లస్ లో సూపర్ సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ తెలుగు హోస్ట్ గా తమన్నా అలరించేందుకు రెడీ అవుతుందట. ప్రముఖ ఓటిటి ఛానెల్ లో ఈ ప్రోగ్రాం రాబోతుందని తెలుస్తుంది.
సెలబ్రిటీస్ తో ఈ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం చేయనుంది తమన్నా. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తమన్నా ఈ స్పెషల్ షోస్ తో తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. తప్పకుండా తమన్నా ఈ షోస్ తో కెరియర్ మరింత జోష్ ఫుల్ గా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎఫ్3 తో పాటుగా గోపీచంద్ సీటీమార్ సినిమాలో నటించింది తమన్నా. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ద్వారా తమన్నా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.