
నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ తో నాని చేసిన ఈ ప్రయత్నం ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదని చెప్పాలి. అయితే తెలుగులో హిట్టైన సినిమాలకే కాదు ఫ్లాప్ అయిన సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. నాని గ్యాంగ్ లీడర్ సినిమా హిందీతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో రీమేక్ అవుతుందని తెలుస్తుంది.
తెలుగు ఆడియెన్స్ ను సరిగా మెప్పించలేదు కాని ఇతర భాషల్లో గ్యాంగ్ లీడర్ తప్పక ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో తమిళ భామ ప్రియాంకా అరుల్ మోహన్ తెలుగు తెరకు పరిచయమైంది. తన సినిమా హిట్ కాకపోయినా ఇతర భాషల్లో రీమేక్ అవడంపై డైరక్టర్ విక్రం కుమార్ సంతోషంగా ఉన్నారు.